అమరావతిలో బసవతారకం ఆసుపత్రి శంకుస్థాపన రేపు

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి రేపు శంకుస్థాపన జరగనుంది. తుళ్లూరు–అనంతవరం గ్రామాల మధ్య ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నారు. 21 ఎకరాల భూమిని సీఆర్డీయే ఇప్పటికే కేటాయించింది. రేపు ఉదయం 9.30 గంటలకు జరిగే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు.

మొదటి దశలో 300 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్మించబడుతుంది. అనంతరం దానిని 1,000 పడకల వరకు విస్తరించనున్నారు. 2014–19 కాలంలోనే అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ప్రభుత్వం భూమి కేటాయించినప్పటికీ, 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు మరోసారి స్థలం కేటాయించడంతో నిర్మాణ పనులకు వేగం తీసుకురావాలని నిర్ణయించారు.

Read More : ఆంధ్రప్రదేశ్ సహా మూడు రాష్ట్రాల్లో కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు

One thought on “అమరావతిలో బసవతారకం ఆసుపత్రి శంకుస్థాపన రేపు

Comments are closed.