బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద భారీ చోరీ జరిగింది. ముంబయి నుంచి చెన్నైకి తరలిస్తోన్న ఎలక్ట్రానిక్ సరుకులో భాగంగా ఉన్న నాలుగు కంటైనర్లలో ఒక కంటైనర్‌లోని 255 ల్యాప్‌టాప్‌లను దుండగులు అపహరించారు. ఈ ల్యాప్‌టాప్‌ల విలువ సుమారు రూ.1.85 కోట్లుగా అంచనా వేయబడింది.
ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి వద్ద కంటైనర్ అలారం మోగినట్లు కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందింది. వెంటనే వారు స్పందించగా, అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. కంపెనీ ప్రతినిధులు మేదరమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చీరాల డీఎస్పీ మొయిన్ తెలిపారు. ఈ ఘటన వ్యాపార వర్గాల్లో ఆందోళన కలిగించింది.
Read More : విజయవాడలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం