నేటి నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. మొత్తం 1.46 కోట్ల కుటుంబాలకు ఈ కార్డులను వచ్చే నెల 15వ తేదీలోగా నాలుగు విడతల్లో అందజేయనున్నారు.

మొదటి విడతలో 9 జిల్లాలకు:

తొలి విడత పంపిణీలో భాగంగా తొమ్మిది జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్డులు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటాయి. దీనివల్ల రేషన్ పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, నకిలీ కార్డులకు చెక్ పెట్టవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఈ స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ లబ్ధిదారులు తాము ఏ సమయంలోనైనా బియ్యం, ఇతర నిత్యావసరాలను పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ప్రజలకు రేషన్ సేవలను మరింత సులభతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని మంత్రి వెల్లడించారు.

Read More : విజయవాడలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం