బండి సంజయ్ సీరియస్‌ : టీజీపీఎస్‌సీకి లేఖ

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలపై అభ్యర్థుల ఆందోళనలకు సంబంధించి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు టీజీపీఎస్‌సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాసి, పరీక్షల నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారం వారం రోజుల్లోగా అందించాలని స్పష్టం చేశారు.

గ్రూప్-1 పరీక్షల ప్రక్రియలో అవకతవకలు, అవినీతికి సంబంధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయని, అభ్యర్థులు తమ వద్దకి వచ్చి అనేక అనుమానాలు వ్యక్తం చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. కొందరు అభ్యర్థులు నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు.

ఈ నేపథ్యంలో, అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ పరీక్షల నిర్వహణలో పారదర్శకతను తీసుకురావాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. పరీక్షల నిర్వహణలో లేనిది లాంటిది జరిగిందా? లీక్స్, మేనేజ్‌మెంట్లు జరిగాయా? అన్న విషయాలపై క్లారిటీ ఇచ్చేలా సమగ్ర నివేదికను వెంటనే అందించాలని టీజీపీఎస్‌సీకి స్పష్టం చేశారు.

Read More : TG – ఉత్తీర్ణత శాతం 98.2%

One thought on “బండి సంజయ్ సీరియస్‌ : టీజీపీఎస్‌సీకి లేఖ

Comments are closed.