మార్వెల్ స్టూడియోస్ నుంచి అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. తాజాగా, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) ఈ చిత్ర తారాగణాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో సుపరిచితమైన మార్వెల్ సూపర్‌హీరోలు మాత్రమే కాకుండా X-మెన్, ఫెంటాస్టిక్ ఫోర్ ఫ్రాంచైజీలు నుంచి కొత్త నటీనటులు కూడా చోటు సంపాదించడం విశేషం. మొత్తంగా 27 మంది టాప్ స్టార్స్ ఈ సినిమాలో నటించనున్నారు.
మార్వెల్ స్టూడియోస్ వెల్లడించిన వివరాల ప్రకారం, తారాగణంలో క్రిస్ హెమ్స్‌వర్త్ (థోర్), టామ్ హిడిల్స్టన్ (లోకీ), ఆంథోనీ మాకీ (కెప్టెన్ అమెరికా), పాల్ రూడ్ (యాంట్-మ్యాన్), లెటిటియా రైట్ (బ్లాక్ పాంథర్), సిము లియు (షాంగ్-చి), విన్‌స్టన్ డ్యూక్ (ఎం బాకు) ఉన్నారు. ఇంకా, థండర్‌బోల్ట్స్ చిత్రం నుంచి సెబాస్టియన్ స్టాన్ (ది వింటర్ సోల్జర్), ఫ్లోరెన్స్ పగ్ (యెలెనా బెలోవా), వ్యాట్ రస్సెల్ (యుఎస్ ఏజెంట్) వంటి నటులు కూడా నటిస్తారు. ఈ చిత్రంలో పాట్రిక్ స్టీవర్ట్ (ప్రొఫెసర్ X), ఇయాన్ మెక్‌కెల్లెన్ (మాగ్నెటో), జేమ్స్ మార్స్‌డెన్ (సైక్లోప్స్), రెబెక్కా రోమిజ్న్ (మిస్టిక్), చానింగ్ టాటమ్ (గాంబిట్) వంటి X-మెన్ నటులు కూడా కనిపిస్తారు. ఫెంటాస్టిక్ ఫోర్ నుంచి పెడ్రో పాస్కల్ (మిస్టర్ ఫెంటాస్టిక్), వెనెస్సా కిర్బీ (ది ఇన్విజిబుల్ ఉమెన్), ఎబోన్ మోస్-బాచ్రాచ్ (ది థింగ్), జోసెఫ్ క్విన్ (ది హ్యూమన్ టార్చ్) ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.
ఈ చిత్రంలో మరో ఆశ్చర్యకరమైన అంశం డాక్టర్ డూమ్ పాత్రలో రాబర్ట్ డౌనీ జూనియర్ ఎంట్రీ. ఈ వార్తను 2023లో శాన్ డియాగో కామిక్-కాన్లో అధికారికంగా ప్రకటించారు. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రం 2026 మే 1న గ్రాండ్ రిలీజ్ కానుండగా, దానికి కొనసాగింపుగా ‘అవెంజర్స్: సీక్రెట్ వార్స్’ 2027 మే 7న విడుదల కానుంది. ఈ భారీ తారాగణంతో, మార్వెల్ అభిమానులకు ఇది ఒక జాక్‌పాట్ సినిమాగా మారనుంది.
2 thoughts on “27 మంది సూపర్‌హీరోలు ఒకే స్క్రీన్‌పై – మార్వెల్ ‘అవెంజర్స్: డూమ్స్‌డే’పై అభిమానుల్లో భారీ అంచనాలు”
Comments are closed.