స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన 43వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల జల్లు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా బన్నీ భార్య స్నేహా రెడ్డి ఎంతో ఎమోషనల్‌గా స్పందించారు. వారి వెకేషన్ సమయంలో దిగిన అనేక మధుర క్షణాలను కలుపుతూ ఓ ప్రత్యేకమైన వీడియోను స్నేహా సిద్ధం చేసి, “హ్యాపీ 43 బర్త్‌డే టు మై లవ్ ఆఫ్ మై లైఫ్” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బన్నీ అభిమానుల మధ్య ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
వీడియోలో అల్లు అర్జున్‌తో కలిసి ఉన్న ప్రతి మధుర జ్ఞాపకాన్ని చూపిస్తూ, స్నేహా తన ప్రేమను హృదయపూర్వకంగా వ్యక్తం చేశారు. “నీ జీవితంలో ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. నాతో కలిసి ఈ ప్రయాణంలో నన్ను భాగస్వామిగా చేసుకున్నందుకు దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ భావోద్వేగంగా చెప్పారు. ఈ వీడియోలో బన్నీతో కలిసి దిగిన పిక్స్‌తో పాటు ‘పుష్ప’ సినిమా సెట్స్‌లో తీసిన కొన్ని ప్రత్యేక క్షణాలూ ఉన్నాయి.
ఇక ప్రొఫెషనల్ ఫ్రంట్‌లోకి వస్తే, బన్నీ తన తదుపరి సినిమాకి సిద్ధమవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ చర్చల కోసం బన్నీ అమెరికాలో ఉన్న వీడియో ఇటీవల బయటకు వచ్చింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. సంగీత దర్శకుడిగా సాయి అభ్యంగర్‌ను ఎంపిక చేయగా, నిర్మాణ బాధ్యతలను సన్ పిక్చర్స్ తీసుకోనుండగా మైత్రీ మూవీస్ కూడా భాగస్వామిగా ఉండే అవకాశం ఉంది.

One thought on “ఇన్‌స్టాలో స్నేహా రెడ్డి స్పెషల్ పోస్ట్.. బన్నీకి ఎమోషనల్ విషెస్”
Comments are closed.