నందమూరి కళ్యాణ్ రామ్ తన 21వ చిత్రంగా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’తో మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ మరోసారి పూనుకున్నాడు. యువ దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పటికే టీజర్‌తోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. గ్రామీణ నేపథ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పవర్‌ఫుల్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు కలిసి అశోక్ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. విజయశాంతి ఈ సినిమాలో కథానాయకుడి తల్లిగా కీలక పాత్ర పోషించనుండటం మరో హైలైట్‌గా నిలుస్తోంది.
ఈ చిత్రం బిజినెస్ పరంగా మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. థియేట్రికల్ హక్కులకు సంబంధించిన డీల్స్ ఇప్పటికే ఆకట్టుకునే స్థాయిలో జరిగాయి. ఆంధ్రా హక్కులు రూ.12 కోట్లకు అమ్ముడవ్వగా, సీడెడ్ రైట్స్ రూ.3.70 కోట్లకు డీల్ క్లోజ్ అయ్యాయి. తాజాగా నైజాం రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కొనుగోలు చేయడం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చనుంది. విడుదలకు ముందు ఉన్న ఈ క్రేజ్ బాక్సాఫీస్ కలెక్షన్లపై పాజిటివ్ ప్రభావం చూపించనుంది.
ఈ నెల 12న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుండగా, ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నాడని సమాచారం. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీకాంత్, సోహైల్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదలవుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులను కూడ ఆకట్టుకునే అవకాశం ఉన్న ఈ సినిమా, కళ్యాణ్ రామ్ మార్కెట్‌కి మరో మెరుగైన మైలురాయిగా నిలవబోతోంది.
