అర్జున్ ట్రైలర్ టాక్: మాస్ కంటెంట్‌కు మదర్ ఎమోషన్ మిక్స్

Arjun s/o Vaijayanthi trailer

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో సయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ నెల 18న విడుదల కానున్న ఈ సినిమాపై ట్రైలర్ విడుదలతో హైప్‌ మరింత పెరిగింది.

ట్రైలర్‌ను బట్టి చూస్తే కథలో ఇంటెన్స్ ఎమోషనల్ టచ్‌తో పాటు మాస్ యాక్షన్‌కి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఐపీఎస్ ఆఫీసర్ అయిన తల్లి వైజయంతి సామాజిక దుర్మార్గాలపై పోరాటం చేస్తుండగా, ఆమె కొడుకు అర్జున్ మాత్రం రౌడీగానే మారిపోతాడు. తల్లి కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలు, టగ్ ఆఫ్ వార్, ఆ తర్వాత జరిగే మార్పు సినిమాకి కీలకం కానుంది.

కళ్యాణ్ రామ్ మాస్ లుక్‌, యాక్షన్ మానరిజమ్స్ ట్రైలర్‌లోనే ఆకట్టుకుంటున్నాయి. విజయశాంతితో కలసిన భావోద్వేగ సన్నివేశాలు ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాస్, క్లాస్ ప్రేక్షకులెవరైనా ఈ సినిమాను ఎంజాయ్ చేసేలా అన్ని కమర్షియల్ అంశాల్ని జోడించినట్టు కనిపిస్తోంది.

ఇటీవల మాస్ సినిమాల పరంగా బాగా ఆకట్టుకుంటున్న కళ్యాణ్ రామ్, ఈ చిత్రంతో మరో హిట్ కొట్టే ఆశలు పెట్టుకున్నాడు. ప్రత్యేకంగా తల్లి కొడుకుల బంధాన్ని ప్రధానంగా చూపించే ఈ సినిమా భావోద్వేగ పరంగా ప్రేక్షకులను కదిలించే అవకాశం ఉంది. ట్రైలర్ చూస్తే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ పక్కా పైసా వసూల్ మూవీ అని చెప్పొచ్చు.

Read More




One thought on “అర్జున్ ట్రైలర్ టాక్: మాస్ కంటెంట్‌కు మదర్ ఎమోషన్ మిక్స్

Comments are closed.