ఏపీ : రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులు, 34,600 ఉద్యోగాలు.

Chandrababu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో అధ్యక్షతన గురువారం నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) 6వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశంలో సుమారు రూ.33,720 కోట్లు విలువైన 19 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం పొందింది. ఈ పెట్టుబడులు ప్రధానంగా ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్ రంగాలకు సంబంధించినవి. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 34,621 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించబడుతాయని అంచనా.

గత 11 నెలల్లో ఎస్ఐపీబీ ఆరుసార్లు సమావేశమై, మొత్తం 76 ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చింది. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.4,95,796 కోట్లు పెట్టుబడులు రావడం, 4,50,934 మందికి ఉద్యోగాలు కల్పించనుందని ప్రభుత్వం వివరించింది. కొన్ని సంస్థలు ఇప్పటికే శంకుస్థాపనలు కూడా పూర్తిచేశాయి.

6వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన ప్రధాన పెట్టుబడులు మరియు ఉపాధి వివరాలు ఇలా ఉన్నాయి:

ఐ అండ్ సి విభాగం:

  • డెక్కన్ ఫైన్ కెమికల్స్, అనకాపల్లి – రూ.1,560 కోట్లు, 1,800 ఉద్యోగాలు
  • భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీ సత్యసాయి జిల్లా – రూ.1,400 కోట్లు, 800 ఉద్యోగాలు
  • పీయూఆర్ ఎనర్జీ, కర్నూలు – రూ.1,286 కోట్లు, 1,200 ఉద్యోగాలు
  • బ్లూ జెట్ హెల్త్ కేర్, అనకాపల్లి – రూ.2,300 కోట్లు, 1,750 ఉద్యోగాలు
  • జుపిటర్ రెన్యూవబుల్స్, అనకాపల్లి – రూ.2,700 కోట్లు, 2,216 ఉద్యోగాలు

టెక్స్టైల్ విభాగం:

  • రాంభద్ర ఇండస్ట్రీస్, పశ్చిమ గోదావరి – రూ.228 కోట్లు, 250 ఉద్యోగాలు
  • మోహన్ స్పింటెక్స్, కృష్ణా – రూ.482 కోట్లు, 1,525 ఉద్యోగాలు
  • ఏటీసీ టైర్స్, అనకాపల్లి – రూ.1,779 కోట్లు, 600 ఉద్యోగాలు

ఏపీఐఐసీ విభాగం:

  • వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్, తిరుపతి – రూ.1,061 కోట్లు, 10,098 ఉద్యోగాలు
  • అలీప్ కుప్పం, చిత్తూరు – రూ.5 కోట్లు, 1,500 ఉద్యోగాలు

ఎనర్జీ విభాగం:

  • నితిన్ సాయి కనస్ట్రక్షన్స్, ఏలూరు – రూ.150 కోట్లు, 500 ఉద్యోగాలు
  • దేశ్‌రాజ్ సోలార్ ఎనర్జీ, అనంతపురం – రూ.2,920 కోట్లు, 230 ఉద్యోగాలు
  • ఆంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్, కడప – రూ.3,941 కోట్లు, 260 ఉద్యోగాలు
  • బొండాడ ఇంజినీరింగ్, అనంతపురం – రూ.9,000 కోట్లు, 3,900 ఉద్యోగాలు

టూరిజం విభాగం:

  • బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్, తిరుపతి – రూ.150 కోట్లు, 350 ఉద్యోగాలు
  • స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్, తిరుపతి – రూ.327 కోట్లు, 570 ఉద్యోగాలు
  • వరుణ్ హాస్పటాలిటీ, విశాఖపట్నం – రూ.899 కోట్లు, 1,300 ఉద్యోగాలు

ఐటీ విభాగం:

  • డైకిన్ ఎయిర్ కండిషనింగ్, శ్రీసిటీ – రూ.2,475 కోట్లు, 5,150 ఉద్యోగాలు
  • సెన్సోరెమ్ ఫోటోనిక్స్, కర్నూలు – రూ.1,057 కోట్లు, 622 ఉద్యోగాలు

ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కుదించడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు సృష్టించబడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పారిశ్రామిక రంగంలో విశ్వాసం కోల్పోయిన పెట్టుబడిదారులను తిరిగి ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సఫలమవుతున్నట్లు పేర్కొన్నారు.