టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’ విడుదలకు సిద్ధమైంది. యాక్షన్-అడ్వెంచర్ శైలిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపారు. సినిమా రిలీజ్ సమీపిస్తోందనే కారణంగా ప్రమోషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు.
ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ.జీ. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. తేజ సజ్జ సరసన రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా, ఈ సినిమాలో భారీ తారాగణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
ముఖ్యంగా నటుడు మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనుండగా, శ్రియ శరణ్, జగపతి బాబు, జయరామ్ వంటి ప్రముఖులు కూడా ఇందులో భాగమయ్యారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Read More : జాన్వీ కపూర్‌పై మాలీవుడ్ విమర్శలు

One thought on “టీజర్‌తో హైప్.. సెప్టెంబర్ 12న విడుదలకు తేజ సజ్జ ‘మిరాయ్’”
Comments are closed.