అనురాగ్ యూనివర్సిటీలో భవనం స్లాబ్ కూలిన ఘటన…

మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భవనం అనురాగ్ యూనివర్సిటీకి చెందినదిగా గుర్తించబడింది. ఈ యూనివర్సిటీ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన కార్మికులను ఆయనకే చెందిన పక్కనున్న నీలిమా ఆసుపత్రికి తరలించారు.

గతంలో ఈ యూనివర్సిటీకి చెందిన నిర్మాణాలు ఫుల్‌ట్యాంక్ లెవెల్ (FTL) ప్రాంతంలో జరుగుతున్నాయని పలువురు స్థానికులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ప్రమాదంపై పూర్తిస్థాయిలో స్పందించకుండా యూనివర్సిటీ మరియు ఆసుపత్రి సిబ్బంది మీడియాను లోపలికి అనుమతించకపోవడం గమనార్హం.

ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

Read More : హర్యానాలో టెన్నిస్ క్రీడాకారిణి హత్యపై మిస్టరీ