సినీ ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొనే సమస్యలు, ప్రత్యేకంగా కొందరు కో-ఆర్టిస్టుల ప్రవర్తనపై నటి అనుప్రియ గోయెంకా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాంచాలి, అసుర్ వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న అనుప్రియ, ఇటీవల సిద్దార్థ్ కన్నన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఆమె చెప్పిన ప్రకారం, తనతో ముద్దు సన్నివేశంలో నటిస్తున్న సమయంలో ఒక నటుడు దాన్ని అతిగా తీసుకొని, వ్యతిరేకంగా ప్రవర్తించాడని వెల్లడించింది.
ఆ సన్నివేశంలో నటిస్తున్నప్పుడు ఆ నటుడు తన నడుముపై కాకుండా తన పిరుదులపై చేయి ఉంచాడని, వెంటనే తాను అతడి చేయి పట్టుకుని నడుముపై ఉంచేందుకు చెప్పానని చెప్పింది. అయినప్పటికీ, మరో సారి కూడా అతడు అదే విధంగా ప్రవర్తించాడని, తనకు బాధ కలిగిందని అనుప్రియ వివరించారు. కానీ ఆ సమయంలో అతడిని ప్రశ్నించడం వల్ల అది పొరపాటుగా జరిగిందని చెప్పి తప్పించుకుంటాడని భావించి, మౌనంగా ఉండిపోయానని అన్నారు.
తర్వాతి టేక్‌లో ఇదే సమస్య మరల జరిగే ప్రమాదాన్ని నివారించేందుకు, కఠినంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు చెప్పారు. అనుప్రియ గోయెంకా వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో మహిళల భద్రతపై కొత్తగా చర్చకు దారితీశాయి. వ్యక్తిగత గౌరవం, ప్రొఫెషనల్ ఎథిక్స్‌ను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి స్పష్టంచేస్తోంది.

One thought on “అనుప్రియ గోయెంకా షాకింగ్ వ్యాఖ్యలు – సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలు”
Comments are closed.