బైక్ ప్రమాదంలో యువకుడి మృతి, తండ్రి ఆవేదన.

పామిడి సమీపంలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద బైక్ అదుపు తప్పి అనంతపురం అశోక్‌నగర్‌కు చెందిన సుమంత్(25) అక్కడికక్కడే మృతిచెందాడు. గుంతకల్లు నుంచి అనంతపురానికి బైక్‌పై వస్తున్న సమయంలో 44వ జాతీయ రహదారిపై ఉన్న కల్వర్ట్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తన కొడుకు మృతిచెందిన విషయం తెలుసుకున్న తండ్రి శివప్రసాద్ ఆసుపత్రికి చేరి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. “నాన్నను వచ్చాను లేవురా… నీ అమ్మకు ఏమని చెప్పాలిరా!” అంటూ కుమారుడి మృతదేహంపై కన్నీరు కార్చారు.

Read More : భారతరత్నకు అర్హుడు రతన్ టాటా — ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ