ఆనంద్ మహీంద్రా తెలుగులో ట్వీట్ వైరల్: ఫ్యూరియో-8 ట్రక్కు

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన స్పష్టమైన అభిప్రాయాలు, ప్రోత్సాహక పోస్టులతో ఆయన తరచూ ట్రెండ్ అవుతుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా మారింది. మహీంద్రా సంస్థ నుంచి తాజాగా విడుదలైన ఫ్యూరియో-8 ట్రక్కులకు సంబంధించిన యాడ్‌ను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. విశేషం ఏమిటంటే.. ఈసారి ఆనంద్ మహీంద్రా తెలుగు భాషలోనే ట్వీట్ చేశారు. ‘‘ఒక్క నిర్ణయం చాలు… మీ విధి మీ చేతుల్లో ఉంది… ట్రక్ మార్చండి… మీ విధిని వశం చేసుకోండి’’ అంటూ ఆయన తెలుగు ప్రజలకు మద్దతుగా ఆకర్షణీయంగా స్పందించారు. ఆయన ఈ విధంగా స్వభాషలో స్పందించడంతో తెలుగు నెటిజన్లలో ఆనందం నెలకొంది. ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఈ పోస్టుతో పాటు యాడ్ వీడియోను కూడా షేర్ చేసిన మహీంద్రా.. తమ సంస్థ కొత్తగా విడుదల చేసిన వాహనానికి ప్రజల్లో మరింత ప్రచారం లభించాలన్న ఉద్దేశంతో తెలుగు మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

Read More : ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ ఇంట్లో ఈడీ సోదాలు

One thought on “ఆనంద్ మహీంద్రా తెలుగులో ట్వీట్ వైరల్: ఫ్యూరియో-8 ట్రక్కు

Comments are closed.