అల్లు అర్జున్-అట్లీ సినిమా: మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా ఫిక్స్!

Allu Arjun Atlee Mrunal Thakur Movie

పుష్ప 2 విజయంతో జోరుమీదున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన తదుపరి సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. బన్నీ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బన్నీ ఇప్పటికే లుక్ టెస్ట్ పూర్తి చేసినట్లు సమాచారం.

ఇటీవల “సీతారామం”, “హాయ్ నాన్న” సినిమాల ద్వారా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. గురువారం ఆమెకు లుక్ టెస్ట్ నిర్వహించగా, చిత్రయూనిట్ ఆమె లుక్‌తో ఎంతో సంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. త్వరలో చిత్ర బృందం ఆమె పేరును అధికారికంగా ప్రకటించనుంది.

ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని టాలీవుడ్ టాక్. మృణాల్ తర్వాత బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను కూడా ఒక ముఖ్య పాత్ర కోసం సంప్రదిస్తున్నారని, ఆమె ఎంపిక కూడా తుదిదశలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మూడో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారన్నది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

జూన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నాడు. అంతేకాదు, లాస్ ఏంజిల్స్‌ నుంచి ప్రముఖ విఎఫ్ఎక్స్ కంపెనీలను అట్లీ రంగంలోకి దింపినట్టు సమాచారం.

Read More


One thought on “అల్లు అర్జున్-అట్లీ సినిమా: మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా ఫిక్స్!

Comments are closed.