బాలీవుడ్లో స్టార్ హీరోలు కేవలం సినిమాలతోనే కాదు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో కూడా భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. తక్కువ ధరకే అపార్ట్మెంట్లు కొనుగోలు చేసి, ఆ ప్రాంత విలువ పెరిగినప్పుడు అధిక ధరలకు విక్రయించడం ద్వారా కోట్లలో లాభాలు చూస్తున్నారు. ఈ వ్యాపారంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఇప్పటికే దూసుకుపోతుండగా, ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా అదే దారిలో ముందుకెళ్లాడు.
అక్షయ్ కుమార్ తాజాగా ముంబై బోరివలిలోని ఒబెరాయ్ స్కై సిటీలో ఉన్న తన రెండు అపార్ట్మెంట్లను రూ.6.6 కోట్లకు విక్రయించాడు. ఈ డీల్ ద్వారా అతను 85% కంటే ఎక్కువ లాభాలను సాధించాడు. మొదటి అపార్ట్‌మెంట్‌ను రూ.2.82 కోట్లకు కొనుగోలు చేసి, 2025లో రూ.5.35 కోట్లకు విక్రయించి మొత్తం 89% లాభం సాధించాడు. ఈ ఫ్లాట్ సైజ్ 1,080 చదరపు అడుగులు కాగా, స్టాంప్ డ్యూటీగా రూ.32.1 లక్షలు చెల్లించాల్సి వచ్చింది.
అదే విధంగా, రెండో అపార్ట్‌మెంట్‌ను రూ.67.19 లక్షలకు కొనుగోలు చేసి, 2025లో రూ.1.25 కోట్లకు విక్రయించాడు, దీంతో 86% లాభం సంపాదించాడు. ఈ ఫ్లాట్ 252 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో, స్టాంప్ డ్యూటీగా రూ.7.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది.
ఒబెరాయ్ స్కై సిటీ ప్రాజెక్ట్‌లో 2024 నుంచి 2025 మధ్య మొత్తం 818 కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. అక్కడ చదరపు అడుగు రేటు ప్రస్తుతం రూ.44,577గా ఉంది.
ఇటీవల బాలీవుడ్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. స్టార్ హీరోలు సంపాదనను భద్రపరచుకోవడానికి రియల్ ఎస్టేట్‌ను కీలక పెట్టుబడిగా మలచుకుంటున్నారు. అక్షయ్ కుమార్ తాజా లావాదేవీలు కూడా అదే దిశగా సాగిన విజయవంతమైన వ్యూహంగా నిలిచాయి.

One thought on “రియల్ ఎస్టేట్‌లో అక్షయ్ కుమార్ మాస్టర్ స్ట్రాటజీ.. రెండు ఫ్లాట్లతో 85% లాభం!”
Comments are closed.