టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్, తన కెరీర్‌లో ఒక సాలిడ్ హిట్ కోసం ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. గత చిత్రం ‘ఏజెంట్’ భారీ అంచనాల నడుమ విడుదలై విఫలమైన తర్వాత, అఖిల్ తన తదుపరి ప్రాజెక్టులపై పూర్తి ఫోకస్ పెట్టారు. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఆయన, రెండేళ్ల విరామం తర్వాత ఓ పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌తో మళ్లీ వెనక్కి వస్తున్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా ‘లెనిన్’ అనే టైటిల్‌తో కొత్త సినిమా గ్లింప్స్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో ఆకట్టుకున్న మురళీ కిషోర్ అబ్బూరూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగార్జున, నాగవంశీ ఈ చిత్ర నిర్మాతలు. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మాస్ రూరల్ లవ్ డ్రామా గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
గ్లింప్స్ లో అఖిల్ మాస్ లుక్‌లో అత్యద్భుతంగా కనిపించాడు. “పుట్టేటప్పుడు ఊపిరి ఉంటది, పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటది” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో గ్లింప్స్ బాగా హైప్ క్రియేట్ చేసింది. శ్రీలీల కూడా తన లుక్స్‌తో ఆకట్టుకుంది. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ విలువలు, విజువల్స్ అన్నీ టాప్ నోచ్‌గా ఉండడంతో ‘లెనిన్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ సినిమా అఖిల్‌కు కెరీర్ బ్రేక్ ఇవ్వగలదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

One thought on “అఖిల్ మాస్ గెట్‌అప్‌లో అదరగొట్టిన లెనిన్ గ్లింప్స్!”
Comments are closed.