టాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రకుల్ ప్రీత్ సింగ్, తన అందం, అభినయంతో కుర్రకారు మనసులు గెలుచుకుంది. కానీ ఆమె సినీ ప్రయాణం అక్కడితో మొదలైనదే కాదు. కన్నడ సినిమా గిల్లీతో వెండితెర అరంగేట్రం చేసిన రకుల్, మొదట సినిమాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదట.
మోడలింగ్ చేస్తుండగా దక్షిణాది సినిమాలపై తనకు పెద్దగా అవగాహన లేకపోవడం కారణమని, తన ఫస్ట్ మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదని రకుల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తండ్రిని సంప్రదించిన తర్వాత గిల్లీ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు వెల్లడించింది.
సినిమా నటనపై ఆసక్తి పెరగడంతో, చదువు కొనసాగించాడానికి ప్రయత్నిస్తూనే నటన కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు కోసం రకుల్‌కు కాల్ వచ్చింది. అయితే పూరీ 70 రోజులు డేట్స్ అడిగితే, కళాశాల చదువుల కారణంగా అది సాధ్యం కాదని, కలిపి నాలుగు రోజులు మాత్రమే ఇవ్వగలనని చెప్పిందట.
ఈ విషయాన్ని పూరీ కూడా అర్థం చేసుకున్నారని, ఆ సమయంలో మరికొన్ని ప్రాజెక్టులను కూడా వదులుకున్నట్లు రకుల్ వెల్లడించింది. అంతేకాదు, కెరీర్ ప్రారంభంలో ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియక, కొన్ని అవకాశాలను చేజార్చుకున్నట్టు తెలిపింది.
అంతేకాకుండా, జీవితంలో ప్రతీ ఒక్కరికీ బ్రేక్‌ప్స్ ఉంటాయని, వాటి నుంచి ఎన్నో నేర్చుకోవాలని రకుల్ పేర్కొంది. ఎవరి జీవితం వాళ్ళు స్వయంగా తీర్చుకోవాలని, ఇతరుల మీద ఆధారపడకూడదని చెప్పింది. తన భర్త జాకీ భగ్నానీను కలిసినప్పుడు కూడా ఇలాగే మాట్లాడినట్లు వెల్లడించింది. వారి ఆలోచనలూ, అభిప్రాయాలు కలిసిపోవడం వల్లే ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నామని వివరించింది. ఈ ఇంటర్వ్యూలో రకుల్ జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

One thought on “పూరీ జగన్నాథ్ డేట్స్ అడిగితే వద్దన్న రకుల్ ప్రీత్ సింగ్!”
Comments are closed.