గుజరాత్లో ఎయిరిండియా విమానం కుప్పకూలి దాదాపు 274 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనతో విమాన ప్రయాణాలపై భయాందోళనలు కొనసాగుతున్న వేళ, తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన ఘటన వెలుగుచూసింది.
శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబయి బయలుదేరిన ఎయిరిండియా విమానం (AI-180) సోమవారం అర్థరాత్రి తర్వాత కోల్కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానం ఇంజిన్లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు అప్రమత్తమై భద్రతా దృష్ట్యా విమానాన్ని కోల్కతాలో ల్యాండ్ చేసి, ప్రయాణికులందరినీ సురక్షితంగా దిగిపోనిచేశారు.
ఇది వరుసగా జరిగిన రెండో సాంకేతిక లోప ఘటన కావడం గమనార్హం. ముందు రోజు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నుంచి కోల్కతా వెళ్లవలసిన మరో విమానంలోనూ సాంకేతిక లోపం తలెత్తడంతో, అధికారులు అప్పటికే విమానాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో విమాన ప్రయాణికులలో ఆందోళన నెలకొంటుండగా, పైలట్లు తక్షణ చర్యలు తీసుకోవడం వల్ల పెను ప్రమాదాలు తప్పాయన్న విశ్లేషణ వస్తోంది. విమానయాన సంస్థలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

One thought on “కోల్కతాలో ఎయిరిండియా విమానానికి సాంకేతిక లోపం”
Comments are closed.