ఏఐ సాయంతో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. భూముల సమాచారం మరింత పారదర్శకంగా ఉండేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

అధికారికంగా ఆయన వెల్లడిస్తూ, భూములను ఆయా సర్వే నంబర్లతో పాటు భూదారుల ఆధార్ నంబర్లతో లింక్ చేసి భూ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేస్తామన్నారు. ఈ విధానం ద్వారా భూ స్వామ్య హక్కులపై స్పష్టత వస్తుందనీ, నకిలీ పత్రాలు, డబుల్ రిజిస్ట్రేషన్ వంటి సమస్యలు తగ్గుతాయని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో భూ వివాదాల నివారణకు ఇది కీలక నిర్ణయమవుతుందని ఆయన పేర్కొన్నారు.

Read More : పవన్ కళ్యాణ్ : బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు

One thought on “ఏఐ సాయంతో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

Comments are closed.