ఆహారం తిన్న తర్వాత కనిపించే 5 గట్ ఆరోగ్య సమస్యలు.

ఆహారం తిన్న తర్వాత ఈ ఐదు లక్షణాలలో ఏదైనా కనిపిస్తే దాన్ని సాదారణ సమస్యగా తీసుకోవద్దు. ఈ తప్పిదం వల్ల మీ జీర్ణవ్యవస్థకు తీవ్రమైన నష్టం కలగవచ్చు. అందుకే పేగుల ఆరోగ్యం పాడవడానికి ముందే ఈ లక్షణాలను తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

తిన్న తర్వాత కాస్త కునుకు పట్టడం సాధారణమే కానీ, దీనితో పాటు నిద్రలేమి ఉంటే, ఇది శరీరంలో చక్కెర స్థాయిలో సమస్య ఉన్న సంకేతం కావచ్చు. తరచుగా అలాంటి సమస్యలు ఉంటే రక్తంలో చక్కెర స్థాయిని సరిచేసే ఆహారం తీసుకోవాలి.

అలాగే, తిన్న తర్వాత ఎక్కువ త్రేనుపు రావడం కడుపులో ఆమ్లం తక్కువగా ఉందని సూచిస్తుంది. ఈ పరిస్థితిలో త్రేనుపును తగ్గించేందుకు యాంటాసిడ్ మాత్రలు తీసుకోవడం మంచిది.

కడుపు ఉబ్బరం కూడా పేగుల జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల జరుగుతుంది. ఇది ఆహారం పూర్తిగా జీర్ణం కాలేదనే సంకేతం.

భోజనం చేసిన తర్వాత ఛాతీలో బిగుతుగా అనిపిస్తే, శరీరానికి తగ్గ ఆహారం తీసుకోకపోవడమే కారణం. ఈ లక్షణాన్ని గమనించి అలాంటి ఆహారాన్ని తీసుకోవద్దు.

తిన్న వెంటనే ఎక్కువసార్లు వాష్‌రూమ్‌కి పరిగెత్తడం గట్ ఆరోగ్యంలో తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు. దీనికి గట్ డైస్బయోసిస్ లేదా లీకీ గట్ సిండ్రోమ్ వంటి రోగాలు కారణమవుతాయి.

కాబట్టి, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, జీవనశైలి, ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అత్యవసరం. ఆలస్యం చేస్తే సమస్యలు తీవ్రంగా మారే అవకాశం ఉంది.

Read More : రాత్రిపూట ఫోన్‌ను దిండు పక్కన పెట్టి నిద్రపోతున్నారా?

One thought on “ఆహారం తిన్న తర్వాత కనిపించే 5 గట్ ఆరోగ్య సమస్యలు.

Comments are closed.