ఆదిత్య 369 రీ రిలీజ్ పై బాలకృష్ణ గట్టి పట్టుదల!

Aditya 369 re-release

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ “ఆదిత్య 369” ఏప్రిల్ 4న రీ రిలీజ్ కానుంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ రీ రిలీజ్‌కు అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. “అఖండ”, “వీర సింహారెడ్డి”, “భగవంత్ కేసరి”, “డాకు మహారాజ్” సినిమాలతో హిట్ ట్రాక్‌లో ఉన్న బాలకృష్ణ, “అఖండ 2” సీక్వెల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, ఆదిత్య 369 రీ రిలీజ్ విషయంలో ప్రాధాన్యం చూపుతున్నారు. రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య ప్రత్యేకంగా పాల్గొనడంతో పాటు, ఈ సినిమాతో ప్రేక్షకులను మళ్లీ అలరిస్తానని ధీమాగా తెలిపారు.

“ఆదిత్య 369” రీ రిలీజ్‌పై బాలకృష్ణ అంతగా ఆసక్తి చూపడానికి ఓ ముఖ్య కారణం ఉంది. ఈ సినిమా సీక్వెల్‌ చేసేందుకు బాలయ్య గత కొన్ని సంవత్సరాలుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. స్వయంగా కథను సిద్ధం చేయడంతో పాటు, ప్రముఖ రచయితల సహాయంతో ఫైనల్ వెర్షన్‌కు శ్రమిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ స్వయంగా సీక్వెల్‌పై ప్రకటన చేయడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. సీక్వెల్‌ను టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లోనే నడపాలని, కొత్త తరానికి తగ్గట్లుగా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు.

బాలయ్య తన ప్రస్తుత జోష్‌కి తగ్గట్లుగా సీక్వెల్‌ను పూర్తి చేయడం కష్టమే కాదు, దాన్ని భారీ స్థాయిలో మార్కెట్ చేయడం సవాలుగా మారనుంది.ఇదిలా ఉండగా, “ఆదిత్య 369” సీక్వెల్‌లో మోక్షజ్ఞ కీలక పాత్రలో కనిపించనున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పటివరకు ఈ వార్తపై అధికారిక ప్రకటన రాలేదు. బాలకృష్ణ తన క్రమశిక్షణ, పట్టుదలతో సీక్వెల్‌ను తెరకెక్కిస్తే, అది తెలుగు సినీ పరిశ్రమలో మరో సైన్స్ ఫిక్షన్ మాస్టర్‌పీస్‌గా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.

సింగీతం శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీక్వెల్‌ రూపొందితే మంచి ఫలితం సాధించవచ్చని బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. మరి బాలకృష్ణ స్వయంగా ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేస్తారా? మోక్షజ్ఞ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంట్రీ ఇస్తాడా? అనే విషయాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Read More

One thought on “ఆదిత్య 369 రీ రిలీజ్ పై బాలకృష్ణ గట్టి పట్టుదల!

Comments are closed.