ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో విషాదం చోటుచేసుకుంది. రిమ్స్ లో MBBS 2వ సంవత్సరం చదువుతున్న సాహిల్ చౌదరి (19) ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఉరేసుకుని వేలాడుతూ కనిపించిన అతడిని చూసిన తోటి విద్యార్థులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన జరిపి కేసు నమోదు చేశారు. సాహిల్ రాజస్థాన్‌కు చెందిన విద్యార్థి అని పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనకు గల కారణాలు ఇప్పటివరకు వెల్లడికాలేదు. ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాహిల్ మరణం సహ విద్యార్థులు, కాలేజీ సిబ్బందిలో విషాదాన్ని నింపింది. పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
Read More : యువకుడితో ఫోన్ మాట్లాడిందని అక్కను హతమార్చిన తమ్ముడు
