కంగనా రనౌత్‌, మాధవన్‌ జోడీ మరోసారి.. కొత్త సినిమా షూటింగ్ పూర్తి!

కంగనా రనౌత్‌, మాధవన్‌ జోడీ మరోసారి.. కొత్త సినిమా షూటింగ్ పూర్తి!

బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరియు టాలెంటెడ్ హీరో ఆర్. మాధవన్ మరోసారి జోడిగా నటించిన సినిమా షూటింగ్ పూర్తయింది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ విషయాన్ని కంగనా స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. షూటింగ్ ముగిసిన సందర్భంగా చిత్రబృందంతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, త్వరలోనే టైటిల్‌ను ప్రకటించనున్నట్లు తెలిపారు. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇది ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ తర్వాత కంగనా – మాధవన్ జోడిగా కలిసి నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే, ‘తలైవి’ తర్వాత కంగనా రనౌత్ మరోసారి ఏఎల్ విజయ్ దర్శకత్వంలో నటించడం విశేషం. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమా టైటిల్, విడుదల తేదీలను అధికారికంగా వెల్లడించనున్నారు.

Read More

One thought on “కంగనా రనౌత్‌, మాధవన్‌ జోడీ మరోసారి.. కొత్త సినిమా షూటింగ్ పూర్తి!

Comments are closed.