పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న బన్నూ మిలిటరీ బేస్‌ను రెండు ఆత్మాహుతి బాంబర్లు లక్ష్యంగా చేసుకొని తీవ్రవాద దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మందికిపైగా గాయపడ్డారు.
భద్రతా దళాలు, దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ తాలిబాన్‌తో అనుసంధానం కలిగిన ఉగ్రవాద సంస్థ బాధ్యత స్వీకరించింది.
ఈ సంఘటన నేపథ్యంలో బన్నూ ప్రాంతంలో భద్రతా బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి. ఘటనాస్థలిలో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టిన అధికారులు, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

One thought on “పాకిస్తాన్‌లోని బన్నూ మిలిటరీ బేస్‌పై ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు దాడి”
Comments are closed.