ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో వీహెచ్ భేటీ.. కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టాలని విజ్ఞప్తి

pk

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మాజీ ఎంపీ వి.హనుమంతరావు మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర మంత్రి దామోదరం సంజీవయ్య గారి సేవలను గుర్తు చేస్తూ, కర్నూలు జిల్లాకు ఆయన పేరును పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమానికి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిన సంజీవయ్య గారి పేరు చిరస్మరణీయంగా నిలిచేందుకు, ఆయన పేరిట ఒక స్మారక భవనం నిర్మించాలని సూచించారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పవన్ తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, వీహెచ్‌ను సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

Read More