JEE Main 2025: తెలుగు విద్యార్థుల ప్రభంజనం – కోచింగ్ లేకుండానే ఫస్ట్ ర్యాంక్

JEE Main 2025 Toppers List: JEE మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను నిరూపించారు. Hyderabad కు చెందిన బణిబ్రత మాజీ (Banibrata Majhi), Guntur కు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ (Sai Manojna Guttikonda) All India First Rank సాధించారు. ఎలాంటి Coaching లేకుండా స్వయంగా ప్రిపరేషన్ చేసి100 Percentile సాధించడం విశేషం.

About Topper Sai Manojna
సాయి మనోజ్ఞ గుత్తికొండ Andhra Pradesh Palnadu District Guttikonda ప్రాంతానికి చెందిన విద్యార్థిని. ఆమె తండ్రి Kishore Choudhary ఒక Engineering College లో Associate Professor గా పనిచేస్తున్నారు. తల్లి Padmaja ప్రైవేట్ ఆసుపత్రి లో పరిపాలన విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు.

సాయి మనోజ్ఞ రోజుకు 13 గంటలు చదువుకునే వ్యూహంతో JEE Main కు ప్రిపరేషన్ చేసింది. ఇంట్లో అదనంగా ఒక గంట పాటు రివిజన్ చేసింది. Chemistry కొంచెం కఠినంగా అనిపించినా, ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ కొనసాగించిందని తెలిపింది.

సోషల్ మీడియాను పూర్తిగా వదిలివేసిన మనోజ్ఞ

తన చదువుపై పూర్తిగా దృష్టి సారించేందుకు (Focus) ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్ డీయాక్టివేట్ (Deactivated) చేసిందని చెప్పింది. ధ్యానం (Meditation) ద్వారా ఒత్తిడిని తగ్గించుకునేదని తెలిపింది.

JEE Main 2025 – Talent of Telugu students
ఈ సంవత్సరం 100 పర్సంటైల్ సాధించిన 14 మంది టాపర్లలో Rajasthan నుంచి అత్యధికంగా 5 మంది ఉన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి 2 మంది టాపర్స్‌గా నిలిచారు. గతేడాది 20 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, వారిలో 10 మంది రెండు తెలుగు రాష్ట్రాలవారే ఉండటం గమనార్హం.

JEE Main 2025 – పరీక్ష వివరాలు

జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో JEE Main 2025 Paper 1 పరీక్షలు నిర్వహించగా, 13,11,544 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 12,58,136 మంది పరీక్షకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 1.60 లక్షల మంది పరీక్ష రాశారు.

JEE Main Paper 2 (B.Arch/B.Planning) ఫలితాలు కూడా త్వరలో విడుదల కానున్నాయి. NITs, IIITs మరియు ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో (Prestigious Institutes) అడ్మిషన్లకు ఈ ర్యాంకులు కీలకం కానున్నాయి.

Read more

One thought on “JEE Main 2025: తెలుగు విద్యార్థుల ప్రభంజనం – కోచింగ్ లేకుండానే ఫస్ట్ ర్యాంక్

Comments are closed.