సంక్షేమ పథకాల జాబితా తుది జాబితా కాదు: జుక్కల్ ఎమ్మెల్యే
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న అభ్యర్థులు జాబితాలో పేరు రాకపోతే నిరాశ పడవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్యం కాంతారావు అన్నారు. పిట్లం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్న ఆయన సంక్షేమ పథకాలలో ఈరోజు విడుదల చేసిన జాబితా తుది జాబితా కాదని, అర్హులు నిరాశ పడకుండా మళ్లీ దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి లబ్దిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ ప్రక్రియను అర్హులైన వారి కొరకు మండల పరిషత్ కార్యాలయాలలో నిరంతరం దరఖాస్తులు తీసుకునే విధంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పుడు వచ్చిన జాబితా తుది జాబితా కాదని.. ఇందులో కూడా మార్పులు చేర్పులు జరుగుతాయని అర్హులకు మాత్రమే లబ్ధి జరుగుతుందని కాంతారావ్ సభా ముఖంగా తెలిపారు.
