గన్నవరం విమానాశ్రయానికి పొగమంచు కారణంగా పలు సర్వీసులు రద్దు

విజయవాడ: గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన పలు సర్వీసులు రద్దయ్యాయి. పొగమంచు కారణంగా బెంగళూరు, ఢిల్లీ నుంచి రావాల్సిన విమాన సర్వీసులను యాజమాన్యాలు రద్దు చేశాయి. అలాగే హైదరాబాద్, చెన్నై విమానాలు కూడా ఆలస్యంగా రానున్నాయి.

కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం చల్లబడింది. రెండు రోజులుగా పొగమంచు మరింత పెరిగి, వాతావరణాన్ని కమ్మేసింది. ఈ రోజు (బుధవారం) పొగమంచు మరింత కట్టుదిట్టంగా ఏర్పడింది. దీంతో కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి, మరికొన్ని ఆలస్యంగా రానున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ వార్త కూడా చదవండి

One thought on “గన్నవరం విమానాశ్రయానికి పొగమంచు కారణంగా పలు సర్వీసులు రద్దు

Comments are closed.