Thailand క్యాసినోలు, జూదం చట్టబద్ధం: పర్యాటకం, ఆర్థిక వ్యవస్థకు ఊతం

Thailand క్యాసినోలు, జూదం చట్టబద్ధం: పర్యాటకం, ఆర్థిక వ్యవస్థకు ఊతం

పర్యాటక రంగం, మందగమనం చెందిన ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి థాయిలాండ్‌ (Thailand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాసినోలను చట్టబద్ధం చేయడమే లక్ష్యంగా రూపొందించిన ముసాయిదా బిల్లుకు థాయిలాండ్‌ మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో క్యాసినో (Casino), జూదం, బాక్సింగ్, గుర్రపు పందాలు వంటి ఆటలకు అనుమతి లభించనుంది. అక్రమ జూదానికి చెక్ పెట్టడంతోపాటు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే ఈ నిర్ణయ లక్ష్యమని థాయిలాండ్‌ ప్రధాని పటోంగ్‌టార్న్‌ షినవత్రా తెలిపారు.

దేశానికి లాభం

ఈ బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని, పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు. పార్లమెంట్‌లో చర్చ అనంతరం అమల్లోకి వచ్చే ఈ చట్టం పర్యాటకులకు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తుందని అన్నారు. “వినోద సముదాయాలు” పేరిట పథకాల రూపకల్పన ద్వారా మరింత విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

వయసు పరిమితులు

ముసాయిదా చట్టం ప్రకారం హోటళ్లు, కన్వెన్షన్‌ హాల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, థీమ్‌ పార్కులు వంటి ప్రదేశాల్లో క్యాసినోలను అనుమతిస్తారు. అయితే, 20 ఏళ్లు పైబడినవారికే ఆడే అవకాశం కల్పిస్తారు. విదేశీయులకు ఈ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. కానీ థాయ్ పౌరులు మాత్రం క్యాసినోలో ప్రవేశించేందుకు 5,000 భాట్‌ (సుమారు USD 148) చెల్లించాల్సి ఉంటుంది.

ప్రాజెక్టు లక్ష్యం

ఈ బిల్లు పర్యాటక ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ నిర్ణయం థాయిలాండ్‌ ఆర్థిక రంగానికి స్థిరత్వం తీసుకురావడమే కాకుండా, కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుందని ప్రభుత్వ ప్రతినిధి జిరాయు హోంగ్‌సబ్‌ వివరించారు. థాయిలాండ్‌ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం ప్రధాన చోదక శక్తిగా ఉందని, ఈ కొత్త చట్టంతో ఆ రంగం మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

థాయిలాండ్‌ పర్యాటక రంగం కొత్త దశకు చేరేందుకు సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి: