కెనడా ప్రధాన మంత్రి రేసులో అనితా ఆనంద్
కెనడా ప్రధాన మంత్రి రేసులో ఆ దేశ రవాణా మంత్రి, భారత సంతతి మహిళ అనితా ఆనంద్ ముందున్నారు. జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటన చేసిన నేపథ్యంలో, కెనడా తదుపరి ప్రధానిగా ఎవరు అయ్యే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. అనితా ఆనంద్ ఈ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 2025 అక్టోబరులో లేదా ఆ దానిక ముందు కెనడా ఫెడరల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో, అప్పటి వరకు కొత్త ప్రధాని తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
అనితా ఆనంద్ 2019లో తొలిసారి పార్లమెంట్‌కి ఎన్నికయ్యారు. 2019 నుండి 2021 మధ్యముంది ఆమె మంత్రిగా సేవలు అందించారు. అలాగే, ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలిగా మరియు దేశ రక్షణ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
