Allu Arjun Case: అల్లు అర్జున్‌పై అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, డిసెంబరు 21: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో ఉత్కంఠ భరిత చర్చ చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ వ్యవహార శైలిని ప్రస్తావిస్తూ, పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందినా, హీరో బాధ్యతారహితంగా వ్యవహరించారని విమర్శించారు. దుర్ఘటన జరిగిన అనంతరం బాధితులకు సహాయం చేయకుండా, అభిమానులకు చెయ్యి ఊపుతూ సినిమా చూసేందుకు వెళ్లడం బాధ్యుడిగా చర్చకు దారితీసిందన్నారు.
ఇలాంటి ఘోర ఘటనల పునరావృతం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యతారహితంగా వ్యవహరించే వారి పట్ల చట్టపరమైన చర్యలు చేపట్టాలని అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ప్రజల భద్రతకు సంబంధించి మరింత జాగ్రత్త వహించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
