కాళేశ్వరం సీబీఐ విచారణపై కేటీఆర్ ఘాటు విమర్శలు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడం తెలంగాణలో కొత్త రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో కేటీఆర్ పోస్ట్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశ్నలు లేవనెత్తారు. “మిస్టర్ రాహుల్ గాంధీ, తెలంగాణలో మీ కరెన్సీ మేనేజర్ (సీఎం) కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించారు. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా?” అని నిలదీశారు. గతంలో రాహుల్ గాంధీ స్వయంగా సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారి ప్రతిపక్షాలను కుదిపేస్తున్నాయంటూ చేసిన విమర్శలను గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యల స్క్రీన్‌షాట్‌ను కూడా తన పోస్ట్‌లో జత చేశారు. ఇలాంటి సంస్థలకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ అప్పగించడం ఏ విధమైన నిర్ణయమని కేటీఆర్ ప్రశ్నించారు. “మా మీద ఎంత కుట్రలు పన్నినా వెనక్కి తగ్గం. రాజకీయంగానూ, న్యాయపరంగానూ పోరాడతాం. మాకు న్యాయవ్యవస్థపైనా, ప్రజలపైనా నమ్మకం ఉంది. సత్యమేవ జయతే” అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుకు సీబీఐ విచారణను వాడుకుంటోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

Read More : బీఆర్ఎస్ బాధ్యత వహించాలి: బండి సంజయ్

One thought on “కాళేశ్వరం సీబీఐ విచారణపై కేటీఆర్ ఘాటు విమర్శలు.

Comments are closed.