ప్రియుడితో కలసి భార్య ఘాతుకం

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. జిల్లెల శేఖర్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ కేసులో దర్యాప్తు జరిపిన పోలీసులు, శేఖర్‌ను అతని భార్య చిట్టి తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు గుర్తించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితురాలు చిట్టిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

Read More : ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష