అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నం (94) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. దివంగత నటుడు అల్లు రామలింగయ్య భార్య అయిన కనకరత్నం మృతితో కుటుంబంలోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా విషాదం చోటుచేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం ముంబైలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్లో ఉండగా, సమాచారం అందుకున్న వెంటనే హైదరాబాద్కు చేరుకున్నట్లు తెలిసింది.
అల్లు అరవింద్ తల్లి మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేస్తున్నారు. టాలీవుడ్లో శోకసంద్రం నెలకొంది.
Read More : దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సీఎంతో భేటీ

One thought on “అల్లు కుటుంబంలో విషాదం..”
Comments are closed.