దివ్యాంగుల పెన్షన్లపై షర్మిల ఆగ్రహం

ys sharmila

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దివ్యాంగుల పెన్షన్ రీ-వెరిఫికేషన్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అర్హులైన లబ్ధిదారులను వేధిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆమె ధ్వజమెత్తారు. అనర్హులను తొలగించే పేరుతో నిజమైన దివ్యాంగుల పింఛన్లను రద్దు చేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం మానవత్వం కోల్పోయిందని షర్మిల విమర్శించారు.

బోగస్ పెన్షన్లను గుర్తించడం, దొంగ సర్టిఫికెట్లతో లబ్ధి పొందుతున్న వారిని తొలగించడం కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేశారు. అలాంటి సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, రీ-వెరిఫికేషన్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, నిజమైన లబ్ధిదారులు ఇబ్బందులకు గురికావద్దని హెచ్చరించారు.

ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన 1.20 లక్షల మందిలో అధిక శాతం మంది అర్హులే ఉన్నారని తమకు సమాచారం అందిందని షర్మిల తెలిపారు. అనర్హుల జాబితాను మళ్లీ పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు. వికలాంగుల జీవితాలతో రాజకీయాలు చేయకుండా, ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని ఆమె హితవు పలికారు.

Read More : విద్యార్థిపై ఐరన్ బాక్స్‌తో దాడి

One thought on “దివ్యాంగుల పెన్షన్లపై షర్మిల ఆగ్రహం

Comments are closed.