పింప్రి-చించ్వాడ్‌లో వీధి కుక్కల దాడి

మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న పింప్రి-చించ్వాడ్ నగరంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ఒంటరిగా కనిపిస్తే పిల్లలనే కాదు, పెద్దవాళ్లను కూడా విడిచిపెట్టడం లేదు. తాజాగా, ఏడుగురు వీధి కుక్కల గుంపు దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఒక యువకుడి ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న యువకుడిని ఏడు వీధి కుక్కల గుంపు చుట్టుముట్టింది. వాటి దాడి నుంచి తప్పించుకోవడానికి ఆ యువకుడు బైక్‌ను, పక్కనే ఉన్న ఫ్లెక్సీలను అడ్డుగా పెట్టుకొని చాకచక్యంగా వ్యవహరించాడు. సుమారు 10 నిమిషాలపాటు కుక్కల గుంపు దాడి నుంచి పోరాడి, చివరికి వాటిని తరిమికొట్టి సురక్షితంగా బయటపడ్డాడు.

ఈ ఘటన చూసిన నెటిజన్లు, “అదే పరిస్థితిలో పిల్లలు ఎవరైనా ఉంటే పరిస్థితి ఏంటి?” అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో పింప్రి-చించ్వాడ్ నగరంలో వీధి కుక్కల బెడద మళ్ళీ తీవ్ర చర్చకు దారితీసింది. స్థానిక అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read More : ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్

One thought on “పింప్రి-చించ్వాడ్‌లో వీధి కుక్కల దాడి

Comments are closed.