కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ న్యాయపోరాటానికి సిద్ధం

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. విచారణకు పూర్తిస్థాయిలో సహకరించిన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మాత్రం ఆ నివేదికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయపోరాటం ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది.

కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయస్థానం వారి అభ్యర్థనను తిరస్కరించి, స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో కేసీఆర్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది.

గతంలో కేసీఆర్, హరీశ్ రావు కమిషన్ ఎదుట ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇచ్చినా, నివేదిక బయటకు రాగానే బీఆర్ఎస్ వైఖరిలో వచ్చిన ఈ మార్పు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించేందుకు సన్నాహాలు చేస్తోంది. అనంతరం, తదుపరి దర్యాప్తును సిట్‌కి అప్పగించాలా? లేక సీఐడీకి బదిలీ చేయాలా? అన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ విచారణ కొనసాగితే, కేసీఆర్, హరీశ్ రావు విచారణ అధికారుల ఎదుట మళ్లీ హాజరుకావాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ పరిణామాలతో కాళేశ్వరం వివాదం మళ్లీ రాజకీయ, న్యాయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.

Read More : తెలంగాణలో యూరియా సమస్యపై మంత్రి తుమ్మల చురుకుదనం

One thought on “కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ న్యాయపోరాటానికి సిద్ధం

Comments are closed.