తెలంగాణలో యూరియా సమస్యపై మంత్రి తుమ్మల చురుకుదనం

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా యూరియా సమస్య హాట్ టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం స్పందించడం లేదని అధికార పార్టీ ఆరోపిస్తుండగా, మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు అలాంటి సమస్యే లేదని కొట్టిపారేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రంగంలోకి దిగారు. యూరియా సరఫరా కేంద్రాలకు నిరంతరంగా తరలించేలా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో లారీ అసోసియేషన్‌ల మధ్య పోటీ కారణంగా రవాణా ఆగిపోవడంతో, మంత్రి తుమ్మల స్వయంగా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తున్నారు.

ఇక రామగుండం యూరియా ఫ్యాక్టరీతోనూ మంత్రి తుమ్మల నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. శనివారం రామగుండం ఫ్యాక్టరీ ఎండీని ఆయన కలవనున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఆ ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఉత్పత్తి మళ్లీ ప్రారంభమైతే రాష్ట్రంలో యూరియా సమస్య కొంతవరకు తీరే అవకాశముందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Read More : విద్యార్థుల ప్రాణాలు తీయబోయిన టీచర్

One thought on “తెలంగాణలో యూరియా సమస్యపై మంత్రి తుమ్మల చురుకుదనం

Comments are closed.