రామంతపూర్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్

రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో జరిగిన విద్యుత్ షాక్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TSHRC) తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనను స్వతహాగా (సుమోటో) విచారణకు స్వీకరించిన కమిషన్, ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్, సెప్టెంబర్ 22వ తేదీ లోపు ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించడంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ స్పందించడంతో కేసులో పురోగతి ఉంటుందని భావిస్తున్నారు.

Read More : అధికారులకు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ హెచ్చరిక

One thought on “రామంతపూర్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్

Comments are closed.