తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య కొత్త వివాదం చెలరేగింది. ఈసారి సివిల్ సర్వెంట్లపై ఆరోపణలు ప్రధాన అంశంగా మారాయి. రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కె. సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలోని బృందం ఢిల్లీలో కేంద్ర సిబ్బంది, ప్రజా వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర ప్రసాద్‌ను కలసి వినతిపత్రం సమర్పించింది. ఈ బృందంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే… ఐఏఎస్ అధికారిణి దాసరి హరిచందన, ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ, రాజకీయపరంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
సర్వీస్ అధికారులు రాజకీయాలకు అతీతంగా ఉండాలని నిబంధనలున్నప్పటికీ, ఈ ఇద్దరు అధికారులు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆక్షేపించారు. వెంటనే ఆల్ ఇండియా సర్వీస్ ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కేంద్రాన్ని కోరారు.

Read More : కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో కీలక పురోగతి

One thought on “తెలంగాణ సివిల్ సర్వెంట్లపై బీఆర్ఎస్ ఫిర్యాదు”
Comments are closed.