గాంధీ ఆసుపత్రిలో ఖైదీ పరార్ – పోలీసులకు షాక్

హైదరాబాద్ నగరంలో సినిమా సీన్‌ను తలపించే ఘటన చోటుచేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువచ్చిన ఖైదీ పోలీసులను మాయ చేసి పరారయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే… దొంగతనం కేసులో అరెస్టైన సోహెల్‌ను రిమాండ్‌కు తరలించే ముందు వైద్య పరీక్షల కోసం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ సమయంలో సోహెల్‌ బాత్‌రూమ్‌కి వెళ్తానని చెప్పి లోపలికి వెళ్లాడు. అక్కడ కిటికీ తొలగించడానికి సౌకర్యం ఉందని గమనించిన అతను, కిటికీని తీసేసి దానివద్ద నుంచి తప్పించుకున్నాడు.

బాత్‌రూమ్‌లోకి వెళ్లిన ఖైదీ తిరిగి రాకపోవడంతో పోలీసులు డోర్‌ ఓపెన్‌ చేసి చూసేసరికి… అతను కనిపించలేదు. దీంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం సోహెల్ కోసం విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read More : బోధన్‌లో గూఢచారి పావురం కలకలం (video)

One thought on “గాంధీ ఆసుపత్రిలో ఖైదీ పరార్ – పోలీసులకు షాక్

Comments are closed.