నాగర్‌కర్నూల్‌లో స్కూల్ బస్సు బోల్తా

నాగర్‌కర్నూల్ మండలం గన్యాగుల గ్రామ శివారులో ఒక స్కూల్ బస్సు బోల్తా పడింది. అయితే, అదృష్టవశాత్తు బస్సులో ఉన్న సుమారు 20 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ప్రమాద వివరాలు:
పెద్దకొత్తపల్లిలోని ఆల్ సెంట్స్ మోడల్ స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకుని వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో నియంత్రణ కోల్పోయింది. దీంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో వరి నాట్లు వేస్తున్న కూలీలు అప్రమత్తమై విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More : కొత్వాల్‌గూడ ఎకో పార్క్ ఆలస్యంపై కేటీఆర్ విమర్శలు

One thought on “నాగర్‌కర్నూల్‌లో స్కూల్ బస్సు బోల్తా

Comments are closed.