కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ, వైసీపీ నేతలు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నినాదాలు చేశారు.
టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు. ఎన్నికల్లో గెలవడానికి పోలీసులు అడ్డంకిగా వాడుతున్నారని, వైసీపీ కార్యకర్తలను బెదిరించి పోలింగ్ బూత్‌లకు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితర నేతలు పాల్గొన్నారు.
Read More : పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక: B-Tech Ravi

One thought on “రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద వైసీపీ ముట్టడి”
Comments are closed.