మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే అది తనకు అన్యాయం జరిగినట్టేనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా మునుగోడు అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్ గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు:
- ‘మాటిచ్చారు, ఇవ్వండి’: “మీరు మాటిచ్చారు, ఇచ్చినప్పుడు ఇవ్వండి. కానీ అప్పటివరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి, ఒక్క రూపాయి కూడా ఆపొద్దు. సమీకరణలు కుదరడం లేదని అంటున్నారు, ఎందుకు కుదరడం లేదు? ఎవరడ్డుకుంటున్నారు?” అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
- ‘తెలియదా అన్నదమ్ములం అని?’: “నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు మేమిద్దరం అన్నదమ్ములం అని తెలియదా? పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండోసారి హామీ ఇచ్చినప్పుడు తెలియదా? ఇప్పుడు ‘ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య’ అన్న చందంగా ఉంది” అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
- ‘మంత్రుల లెక్క’: “తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. మరి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా?” అని ఆయన నిలదీశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Read More : చందానగర్ ఖజానా జ్యువెలర్స్‌లో భారీ దోపిడీ, కాల్పులు

One thought on “మునుగోడు అభివృద్ధిపై రాజ్ గోపాల్ రెడ్డి ఫైర్”
Comments are closed.