ఢిల్లీలో గోడ కూలి ఏడుగురు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో భారీ విషాదం చోటుచేసుకుంది. జైత్పూర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఒక గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు మరియు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారేమోనని గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదానికి కారణమైంది.

Read More : ‘ఆపరేషన్‌ సిందూర్‌’: 5 పాక్ యుద్ధ విమానాలను కూల్చాం