ఎన్నికల విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల దొంగలకు త్వరలో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“ఓట్ల చోరీ అనేది కేవలం ఎన్నికల కుంభకోణం కాదు. ఇది మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి జరిగిన పెద్ద ద్రోహం” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
సమయం వచ్చినప్పుడు ఓట్ల దొంగతనానికి పాల్పడిన వారందరికీ శిక్ష తప్పదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఫేక్ ఓట్లు నమోదయ్యాయని ఆయన ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Read More : ఢిల్లీలో హుమా ఖురేషి బంధువు హత్య

One thought on “ఓట్ల దొంగలకు శిక్ష తప్పదు: రాహుల్ గాంధీ”
Comments are closed.