అనంతపురంలో చిరుత సంచారం

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న రామప్ప కొండపై చిరుత కనిపించడంతో స్థానిక గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామస్థులను అప్రమత్తం చేస్తూ, దాని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామాల సమీపంలోకి చిరుత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరుత కనిపించిన ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.

Read More : దేవీపట్నంలో సచివాలయం ఉద్యోగిని కిడ్నాప్

One thought on “అనంతపురంలో చిరుత సంచారం

Comments are closed.