దేవీపట్నంలో సచివాలయం ఉద్యోగిని కిడ్నాప్

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నంలో పట్టపగలే దారుణం జరిగింది. సచివాలయంలో పనిచేస్తున్న సౌమ్య అనే ఉద్యోగినిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు.

ఈరోజు ఉదయం ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు సచివాలయంలోకి చొరబడి, సౌమ్యను బలవంతంగా ఒక ఇన్నోవా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాపర్ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Read MOre : చేనేత కార్మికులకు అండగా ఏపీ ప్రభుత్వం

One thought on “దేవీపట్నంలో సచివాలయం ఉద్యోగిని కిడ్నాప్

Comments are closed.