ప్రముఖ నటి హన్సిక మోత్వానీ తన వైవాహిక జీవితంపై వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి భర్త సోహైల్ కతూరియాతో దిగిన పెళ్లి ఫొటోలను తొలగించడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చర్యతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారన్న ప్రచారానికి మరింత ఊపిరి పోసినట్లైంది.
హన్సిక, వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో 2022 డిసెంబర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకను ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేశారు. అయితే, కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, విడివిడిగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పుకార్లపై సోహైల్ ఇప్పటికే స్పందించి ఖండించినప్పటికీ, హన్సిక మాత్రం ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి.
వ్యక్తిగత జీవితంలో ఇలాంటి చర్చలు జరుగుతున్నప్పటికీ, హన్సిక తన సినీ కెరీర్‌పై పూర్తి దృష్టి సారించారు. ఇటీవల ‘గార్డియన్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆమె, ప్రస్తుతం ‘శ్రీ గాంధారి’ అనే కొత్త ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు.

One thought on “Hansika : విడాకుల పుకార్లకు మరింత బలం”
Comments are closed.